దయచేసి అలా మాత్రం చేయకండి... ఎమోషనల్ అయిన చిరంజీవి!

కరోన వల్ల రోజురోజుకీ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది నటులు తమ వంతుగా జనాల్లో చైతన్యం కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోని పోస్ట్ చేసారు. “అందరికీ నమస్కారం కరోన సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ఎంతోమంది ఈ వైరస్ భారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతోంది. మన ఆత్మీయుల్లో కొందర్ని ఈ వైరస్ వల్ల కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతోంది. ఈ తప్పని సరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ లాక్ డౌన్ పెట్టారు. కనీసం ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి” అంటూ జాగ్రత్తలు చెప్పారు.

అలాగే ఇదివరకే కరోన వచ్చిన వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేయాలని ఆయన అన్నారు. తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని లాక్ డౌన్ లో కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నారని, వ్యాక్సిన్ వేయించుకుంటే కరోన సోకినా దాని ప్రభావం తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఎవరూ కూడా పాజిటివ్ అని తెలిసి కంగారు పడవద్దని, కరోన కంటే ముందు భయం మనల్ని చంపేస్తుందని ఆయన సూచించారు. దయచేసి ఎవరూ కూడా అవసరం లేనిదే బయటకు వెళ్ళకండి మీరు సురక్షితంగా ఉంటేనే మీ కుటుంబం సురక్షితంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆచార్య చిత్ర షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే సోనూ సూద్ కి కరోన పాజిటివ్ రావడంతో షూటింగ్ ను వాయిదా వేశారు. ఆ తర్వాత చిత్ర యూనిట్ లో కొంతమందికి పాజిటివ్ అని తేలడంతో వాయిదా పడుతూ వచ్చిందని సమాచారం. అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకున్న టైమ్ లో లాక్ డౌన్ కారణంగా మళ్ళీ షూటింగ్ ను నిలిపివేశారు. ఈ చిత్రం కోసం మెగా అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.