Are you ready to listen to the #ChittiStory ?
— BARaju (@baraju_SuperHit) December 24, 2020
An @actorvijay and @Dir_Lokesh film .. #Master #ThalapathyVijay@VijaySethuOffl @anirudhofficial @MalavikaM_ @SunTV @EastCoastPrdns @Jagadishbliss @XBFilmCreators @Lalit_SevenScr pic.twitter.com/LxHUtl1tPi
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా, మరో స్టార్ హీరో విజయ్ సేతుపతీ విలన్గా రూపొందిన సినిమా మాస్టర్. ఈ సినిమా ఈ ఏడాదే విడుదాల కావాల్సింది. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా నేపథ్యంలో థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. కానీ కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు మొగ్గు చూపడంలేదు. దాంతో ఈ సినిమా విడుదల నిలిచింది. అతి త్వరలో సినిమా విడుదల అవుతుందని సమాచారం. ఈ సినిమా టీజర్ తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ టీజర్ అనేక రికార్డులను తిరగరాసింది. అతి తక్కువ సమయంలోనే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని థియేటర్ల యాజమాన్యం భావిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి చిట్టి స్టోరీ పాట రేపు విడుదల కానుంది. ఈ పాట ను చిత్ర యునిట్ విడుదల చేయనుంది. ఈ పాట కుట్టి స్టోరీ పేరుతో తమిళ్ లో విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఈ మాస్టర్ సినిమా కి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహింఛాడు. క్రేజీ మ్యుజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించారు.