చంద్రబోస్ భార్య ఎవరో తెలుసా

ఇండస్ర్టీలో చాలామంది తమ మనసుకు దగ్గరైన వారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.అలా నాగార్జున, అమల గారిని , పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ని ఇలా చాలా మంది జంటలు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాయి. అయితే ఇలా తెర మీద నటి నటులే కాకుండా తెర వెనుక కూడా ఈ మ్యాజిక్ పని చేసింది చాలా సార్లు. అలా కలిసిన వాళ్లే  పాటల రచయిత చంద్రబోస్ గారు మరియు సినిమాల్లో పాటలని కొరియోగ్రఫీ చేసే సుచిత్ర గారు.

చంద్ర బోస్ గారు వరంగల్ లో జన్మించి హైదరాబాద్ కి వచ్చి దూరదర్శన్ లో సింగర్ గా ప్రయత్నం చేశారు. ఆయన ఎంత ప్రయత్నం చేసినా అది జరగలేదు. అయితే ఆ తర్వాత ఆయన ఫ్రెండ్ కి ముప్పాలనేని శివ తెలియడంతో ఆయనని కలిసి తాజ్ మహల్ సినిమాలో మంచు కొండల్లోన ముత్యమా పాటని రాసే అవకాశం అందుకున్నారు.

ఇక ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో ఆయన ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు.అయితే చంద్రబోస్ గారి భార్య సుచిత్ర గారి గురించి చాలామందికి తెలియదు.  రాఘవేంద్రరావు తీసిన ఆకరిపోరాటం సినిమాతో కొరియోగ్రాఫర్ గా మొదటిసారి చేసిన సుచిత్ర గారిని చంద్రబోస్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఆమె ఆఖరిపోరాటం సినిమా తర్వాత చాలా సినిమాలు చేసింది.

అందులో నువ్వు నాకు నచ్చావ్ , మనీ, గాండీవం లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ ని హీరోగా పరిచయం చేస్తూ  వచ్చిన పల్లకిలో పెళ్లి కూతురు సినిమాకి సుచిత్ర గారే దర్శకత్వం వహించారు.చాలామంది పెళ్ళి అయ్యాక సినిమాలు మానేసి ఇంటికే పరిమితం అవుతారు కానీ సుచిత్ర గారు మాత్రం పెళ్ళి జరిగాక కూడా వరసగా సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆమె సినిమాలలో కొరియోగ్రాఫర్ గా చంద్రబోస్ గారు పాటలు రాస్తూ ఇద్దరు హ్యాపీ గా తమ దపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.