2020లో ప్రాణాలు కోల్పోయిన మన తెలుగు రత్నాలు

2020వ సంవత్సరం నిజంగానే అందరితో 20 – 20 ఆడుకుంది. ప్రపంచాన్ని వణికించిన కరోన మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. రోజు కూలీలు, పల్లెల నుండి పట్ణానికి వలస వచ్చిన వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. ఎంతో మంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది కరోన వల్ల ప్రాణాలు కోల్పోతే మరి కొంతమంది వేరే కారణాల వల్ల మరణించారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న వారిలో సినీ కళాకారులు కూడా ఉన్నారు. థియేటర్ లో పని చేసే వాళ్ళకి యాజమాన్యం జీతాలు ఇవ్వలేక వాళ్ళు కూడా ఎంతో సతమతమయ్యారు. అయితే 2020 సంవత్సరంలో మరణించిన తెలుగు సినీ పెద్దలు వీళ్ళు.

ఎస్పీబీ

గాన గంధర్వుడు, భారతీయ సంగీత అధ్యనంలో ఒక కలికితురాయి అయిన బాలు గారు కరోన కారణంగానే కన్నుమూసారు. అన్ని భారతీయ భాషల్లో 35 వేలకు పైగా పాటలు పాడిన ఆయన 6 సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన ఆయన అక్కడే సెప్టెంబర్ 25న తుది శ్వాస విడిచారు. అయన మరణంతో సినీ సంగీతం మూగబోయింది.

జయప్రకాశ్ రెడ్డి

కరుడు గట్టిన ఫ్యాక్షనిస్ట్ గా, తన ఆహార్యంతో ముచ్చెమటలు పట్టించే నటుడు జయప్రకాశ్ రెడ్డి. ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి, జయం మనదేరా, నరసింహ నాయుడు లాంటి చిత్రాల్లో ఆయన్ను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన గుంటూరులో స్వగృహంలో హార్ట్ ఎటాక్ కారణంగా సెప్టెంబర్ 8న మరణించారు. ఆయన మరణంతో తెలుగు పరిశ్రమ గొప్ప నటుడ్ని కోల్పోయింది.

రావి కొండల రావు

నటుడిగా, రచయితగా, నాటక కర్తగా, పాత్రికేయుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు కొండలరావు గారు. దైవబలం సినిమా నుంచి ఎన్నో చిత్రాలకు రచన విభాగంలో పనిచేసారు. ఆయన సతీమణి రాధాకుమారి కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన కూడా బేగంపేటలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండె పోటుతో  జులై 28న మరణించారు.

శోభా నాయుడు

నాట్య మయూరిగా పిలవబడే శోభా నాయుడు గారు ప్రముఖ కూచిపూడి కళాకారిణి. నాట్య శిరోమణిగా వెలుగొందిన ఆవిడ నృత్య చూడామణి లాంటి ఎన్నో అవార్డ్లను గెలుచుకున్నారు. న్యూరాలజికల్ సమస్యతో బాధపడుతున్న ఆవిడ చికిత్స కోసం హాస్పిటల్లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆక్టోబర్ 13న తుది శ్వాస విడిచారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.