రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

యాక్షన్ సినిమాలు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు కృష్ణంరాజు. 180కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణంరాజు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నారు. గోపికృష్ణ మూవీస్ బ్యానర్ ను స్థాపించి అభిరుచి గల చిత్రాలను నిర్మించారు కృష్ణంరాజు. తాను చేసే చిత్రాల ఫలితంగా రెబెల్ స్టార్ అన్న పేరుని సంపాదించుకున్న రెబెల్ స్టార్, తన ఇమేజ్ కు భిన్నంగా కృష్ణవేణి, భక్త కన్నప్ప వంటి సినిమాలలో నటించి మెప్పించారు. రాజకీయాలలో సైతం కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారు. ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు ఆయన. 1940 జనవరి 20న జన్మించారు కృష్ణంరాజు. తన తొలి చిత్రం చిలక గోరింక తర్వాత కృష్ణంరాజు గారు విలన్ పాత్రలు కూడా చేసారు. నేనంటే నేనే చిత్రంలో చేసిన విలన్ పాత్ర ఆయనకు చాలా పేరుని తీసుకొచ్చింది. ఇక అక్కడి నుండి ఆయన వెను తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. విలన్ గా దాదాపు 70కు పైగా సినిమాల్లో నటించారు. అమరదీపం చిత్రానికి తన కెరీర్ లో తొలి నంది అవార్డును సొంతం చేసుకున్నారు కృష్ణంరాజు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాధే శ్యామ్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కృష్ణంరాజుగారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీడియా9 తరపున జన్మదిన శుభాకాంక్షలు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.