
తెలుగు ప్రజలని తన నటనతో దశాబ్దాల పాటు అలరించిన నటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయనకి తెలుగు సినీ చరిత్రలో చాలా గొప్ప స్థానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రస్థానం తెలుగులో మూకీ సినిమాల నుంచి టాకీ సినిమాల వరకు సాగింది. జనవరి 22, 2014 లో అస్తమించిన పద్మవిభూషణ్ ఏ.ఎన్.ఆర్ గారి 7వ వర్ధంతి ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు జరుపుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపుగా 255 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ప్రేమాభిషేకం లాంటి సినిమాలు హైదరాబాద్ లో 533 రోజులు ఆడి తెలుగు సినీ చరిత్రలో రికార్డ్ సృష్టించింది. ఇలాంటి సినిమాలు ఏ.ఎన్.ఆర్ గారి కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని మాయాబజార్, దసరా బుల్లోడు, ఆరాధన, డాక్టర్ చక్రవర్తి లాంటి సినిమాలు.ఆయన హీరోగానే కాకుండా నటుడుగా కూడా సీతరామయ్య గారి మనవరాలు, కాలేజ్ బుల్లోడు లాంటి చిత్రాలలో అలరించారు. 2012 లో ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారి పేరు మీద అన్నపూర్ణ ఎడ్యుకేషల్ ట్రస్ట్ ని స్థాపించారు. ఆయన చివరి చిత్రం మనం అక్కినేని గారు కాన్సర్ వ్యాధి తోనే షూటింగ్ ని పూర్తి చేశారు. ఆ సినిమాలో ఆయన కొడుకు నాగార్జున, మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్ కలిసి నటించడం విశేషం. ఈ సినిమా గుర్తుండిపోయే విజయాన్ని సాధించింది.