మీ వైవిధ్యాన్ని ఇక చూడలేము

ఒక పక్క కరోన రోజురోజుకీ పెరిగిపోతుంటే మరో పక్క ఇండస్ట్రీలోని గోపా నటులు, దర్శకులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు వదులుతున్నారు. మొన్నటికి మొన్న తమిళ నటుడు వివేక్ హార్ట్ ఎటాక్ కారణంగా కన్ను మూశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె. వి ఆనంద్ తెల్లవారుజామున 3: 30 కి కార్డియాక్ ఎరస్ట్ కారణంగా తుది శ్వాస విడిచారు. సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించారు. 1966 ఆక్టోబర్ 30న చెన్నైలో ఆయన జన్మించారు. డి.జి. వైష్ణవ కాలేజ్ నుండి ఫిజిక్స్ లో డిగ్రీ పట్టా పొందిన ఆయన, లయోలా కాలేజ్ నుండి విజువల్ కమ్యునికేషన్స్ లో మాస్టర్స్ చేసారు. ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో ఫ్రీలాన్సర్ గా మారి కల్కి, ఇండియా టుడే లాంటి పత్రికలకు ఫోటో జర్నలిస్ట్ గా పనిచేసారు.

ఆ తర్వాత ఒక సందర్భంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ ను కలిసిన ఆయన ఫోటోగ్రఫీ పట్ల తనకున్న ఇష్టాన్ని తెలియజేయగా ఆయన తన దగ్గర అప్రెంటిస్ గా చేర్చుకున్నారు. అలా ఆయన పనిచేసిన దేవర్ మగన్, తిరుడ తిరుడ లాంటి తదితర సినిమాలకు అప్రెంటిస్ గా పనిచేసారు. ఆ తర్వాత ప్రియదర్శన్ తెరకెక్కించిన తేన్మావిన్ కొంబత్ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కెమెరామేన్ గా పనిచేసారు. ప్రేమదేశం, బాయ్స్, శివాజీ సినిమాలకు ఆయనే సినిమాటోగ్రాఫర్.

2005లో వచ్చిన కనా కందేన్ సినిమాతో దర్శకుడిగా తోలి ప్రయత్నంతోనే విజయవంతం అయ్యారు. దాని తర్వాత వచ్చిన అయాన్ (వీడొక్కడే) చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ చిత్రంతో అటు తమిళం ఇటు తెలుగు పరిశ్రమల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తీసిన రంగం, బ్రదర్స్ సినిమాలు కూడా సంచలన విజయాలు సాధించాయి. అలాంటి మంచి దర్శకుడు మనల్ని విడిచి వెళ్ళిపోవటం బాధాకరమైన విషయం ఆయన మృతి పట్ల తమిళ, తెలుగు పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు తమ సంతాపం తెలియజేసారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.