

ఈ మధ్య టాలీవుడ్లో ఇంకా బాలీవుడ్లో అంతా హరా హై తో బరా హై ఛాలెంజ్ ని అందరూ పాటిస్తున్నారు. ఈ ఛాలెంజ్ ని ఒక సెలెబ్రెటీ ఇంకో సెలెబ్రెటీకి ఇచ్చి అందరితో మొక్కలు నాటిస్తున్నారు. అయితే ఇప్పుడు దిన్ని ప్రముఖ నటి రకుల్ ప్రీత్ కూడా 3 మొక్కలు నాటి తనకి ప్రకృతి మీద ఉన్న ప్రేమని చాటుకుంది. తనకి ఈ ఛాలెంజ్ ని అక్కినేని నాగ చైతన్య ఇచ్చారు. అయితే రకుల్ ఛాలెంజ్ ని వేరే సెలెబ్రెటీ కి ఇవ్వకుండా తన ఫాన్స్ అందరినీ ఇలా మొక్కలు నాటమని ప్రకృతిని కాపాడమని తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. ఈ పోస్ట్ లో “కొంచెం ఆలస్యం అయినా నేను కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరిస్తున్న” అని తన ఫాన్స్ కూడా ఇలాగే చేసి తనని సోషల్ మీడియాలో టాగ్ చేయమని కోరింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని మొదలు పెట్టిన ఎం.పి సంతోష్ కుమార్ గారికి అభినందనలు చెప్పింది. ఆమెని చూసి ఆమె ఫాన్స్ కూడా మొక్కలు నాటడం అప్పుడే మొదలు పెట్టారు.