సినిమాలను లైన్లో పెట్టేసిన హీరోలు.....ఇద్దరు తప్ప


టాలివుడ్ అగ్ర హీరోలందరూ తమ సినిమాలను లైన్లో పెడ్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ కాకుండా మరో మూడు సినిమాలు ఆయన కమిట్ అయ్యారు. మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రిమేక్ గా తెరకెక్కనున్న సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు రానా దగ్గుబాటి మరో టైటిల్ రోల్లో నటిస్తున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు, అయ్యారే లాంటి చిత్రాలు తెరకెక్కించిన సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించనున్నారు. ఈ చిత్రంతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తో ఆయన ఒక సినిమా చేయనున్నారు. బాహుబాలి లాంటి సినిమా తర్వాత తన మార్కెట్ పెంచుకుని ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ అన్ని భారి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న రాధే శ్యామ్ కాకుండా మరో 3 సినిమాలు ఆయన ఒకే చేసి ఉన్నారు. కె.జి.ఎఫ్ లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సలార్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. అది కాకుండా ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా ఆయన చేస్తున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్ ఈ చిత్రం తర్వాత ఆయన త్రివిక్రమ్ తో సినిమాను కమిట్ అయ్యారు. దాని తర్వాత చేసే సినిమాల గురించి కొన్ని రూమర్స్ అయతే ఉన్నాయి గాని అవి అఫీషియల్ గా అనౌన్స్ అవ్వలేదు. ఇక రామ్ చరణ్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ జీనియస్ డైరెక్టర్ శంకర్ గారితో సినిమాని చేయనున్నారు. ఇక మిగిలింది అల్లు అర్జున్, మహేష్ బాబు. వీరు తమ తదుపరి చిత్రాల్ని ఇంకా అనౌన్స్ చేయలేదు. వీరి తర్వాతి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. మరి వీరు ఎప్పుడు తమ తదుపరి చిత్రాల్ని అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.