
ప్రస్తుతం ఎక్కడ చూసిన సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. పోలీసులు ఎన్ని రకాలుగా హెచ్చరించిన కూడా మోసపోయేవాళ్ళు మోసపోతూనే ఉన్నారు. అయితే సినిమా సెలెబ్రెటీస్ సైతం ఈ సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారు అంటే విచిత్రం అనే చెప్పాలి. మనం చెప్పుకునే సెలెబ్రెటీ ఎవరో కాదు ఛలో , భీష్మ లాంటి మంచి ఎంటర్టైమెంట్ సినిమాలని తీసిన డైరెక్టర్ వెంకీ కుడుముల .
అయితే ఈ డైరెక్టర్ ని మోసం చేసిన తీరు చాలా వింతగా ఉంది. అది ఎలా అంటే ఈ మద్యనే వెంకీ కుడుముల కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కి భీష్మ సినిమా ఎంపిక చేయాలని అనుకుంటున్నాం అని ఆయన అన్నారు.
అయితే ఈ ఎంపికలో ఒక్కక్క నామినేషన్ కి 11 వేలు చెల్లించాలి అని డైరెక్టర్ ని నమ్మించారు. అయితే అది నిజమే అనుకోని వెంకీ కుడుముల మొత్తం 6 నామినేషన్స్ కి గాను మొత్తం 66 వేలు ఆ సైబర్ మోసగాడికి పంపారు. అయితే చాలా ఆలస్యంగా మోసపోయాను అని తెలుసుకున్న వెంకీ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్లి కేస్ పెట్టారు. ఈ సైబర్ దొంగలని కచ్చితంగా పట్టుకుంటాం అని ఏసీపీ హామీ ఇచ్చారు. ఇక డైరెక్టర్ వెంకీ కుడుముల నాలగా మీరు కూడా మోసపోకండి అని తన సోషల్ మీడియా ద్వారా ఒక లెటర్ ని పోస్ట్ చేసాడు.