
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి. స్టార్ హీరోస్ కి ఫ్యాన్స్ ఉన్నట్లే యాంటి-ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఆ స్టార్ హీరో సినిమా హిట్ అయితే ప్రాబ్లమ్ ఉండదు కాని ఫ్లాప్ అయితేనే అసలు గొడవంతా ఉండేది. సినిమా బాలేదని బ్యాడ్ పబ్లిసిటీ చేస్తుంటారు. ఆ కారణంగా ఎన్నో సినిమాలు హిట్ అవ్వాల్సినవి ఫ్లాప్ అయ్యి తీరని నష్టాలు మిగిల్చాయి కూడా.

ఇక మూడేళ్ళ తర్వాత సినిమల్లోకి వస్తూనే వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన పవన్, ఫ్యాన్స్ కి మాంచి జోష్ ఇచ్చాడు. ఈ చిత్రం కేవలం అభిమానులకే కాకుండా అందరికీ నచ్చింది. ఈ చిత్రంతో ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. దాంతో ఆయనకి ఇప్పుడు కేవలం యూత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఏర్పడ్డారు. దీంతో అయన చేయబోయే తదుపరి చిత్రాలపై భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమాల కోసం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా విపరీతంగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా మలయాళ ఏ.కె రీమేక్ కోసం ఎందుకంటే ఆ చిత్రంలో ఆయన సీరియస్ పోలిస్ పాత్ర పోషించనున్నారు. వకీల్ సాబ్ లో కూడా ఆయన చేసిన లాయర్ పాత్ర సీరియస్ గా సాగుతుంది. అందుకనే ఈ చిత్రంతో ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రానాతో చేస్తున్న ఏ.కె రీమేక్ కూడా సీరియస్ గా సాగే కథ అవ్వడం పవన్ ని సాగర్ చంద్ర ఎలా డీల్ చేస్తాడో అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి కథలు తెరకెక్కించడంలో సాగర్.కె చంద్రది అందవేసిన చేయి. ఆయన తీసిన అయ్యారే, అప్పట్లో ఒకడుండే వాడు లాంటి సినిమాలు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. ఎంత గొప్ప దర్శకుడైన ఎంతోకొంత ప్రెజర్ ఉండటం సహజమే మరి అ ప్రెజర్ ని సాగర్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.