వర్మ ఇప్పుడు ఎవర్ని టార్గెట్ చేసినట్లు?

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలతోనే కాకుండా వివాదాలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలు సృష్టించిన ఆర్జీవి, ఇప్పుడు తన కామెంట్స్ తో, తన ట్వీట్స్ తో చర్చలకు తెరలేపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలన్నీ అపజయాల పాలయ్యాయి. 2019 ఎలక్షన్స్ అప్పుడు విడుదల చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కొద్దిగా పర్వాలేదనిపించింది. అయితే ఆ సినిమా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రూపొందింది.

ఈ మధ్య ఆయన సినిమాలతోనే కాకుండా ఇంటర్వ్యూస్ తో కూడా టీ.వీల్లో, ఇతర మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. సాధారణంగా ఆయన లాజిక్ లేకుండా ఏది మాట్లాడారు. తనకు తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకుంటారు. రీసెంట్ గా కుంభమేళాపై ఆయన తనదైన శైలిలో విమర్శలు చేసారు. యు.పి సీఎంతో పాటు మోదీని ఇతర ప్రభుత్వ నాయకుల్ని తన ట్వీట్ లతో వ్యంగంగా విమర్శించారు. కేవలం ట్వీట్ లతోనే ఆయన అందరినీ తన వైపుకు తిప్పుకోగలరు.

ఇక ఈ కోవలోనే టిడీపి అధినేత చంద్రబాబుపై, ఆయన తనయుడు లోకేష్ పై ఘాటు విమర్శలు చేసారు. టీడిపి పార్టి సభ్యులని ఉద్దేశిస్తూ మీ పార్టీకి చంద్రబాబు, లోకేష్ కరోన వైరస్ లాంటివాళ్ళనీ, ఎన్టీఅర్ వ్యాక్సిన్ అనీ, మీరు, మీ పార్టి ఉండాలంటే తారక్ అనే వ్యాక్సిన్ ని తీసుకోవాలనీ ఆయన అన్నారు. ఈ ట్వీట్ తో ఆయన తారక్ కి పార్టీని హ్యండోవర్ చేసుకోవాల్సిన టైమ్ ఇదే అని సంకేతాలు ఇస్తున్నారు. దీనిపై తారక్ అభిమానులు సానుకూలంగా స్పందించారు. జై తారక్ అంటూ ఆ ట్వీట్ ని కామెంట్స్ తో నింపేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చేసారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.