ఇక జంతువులని చంపాల్సిన పని లేదు అంటున్న పూరి

Listen now #NOMOREKILLING from #PuriMusings 👉 https://t.co/xsH3Nx9krT Charmme Kaur #PC

Posted by Puri Jagannadh on Wednesday, December 9, 2020

లాక్డౌన్ సమయంలో పూరీ మ్యూజింగ్స్ ద్వారా తనకు తెలిసిన విషయాలను గురించి పూరి ఆడియో రూపంలో చెబుతున్నారు. ఇప్పటికే చాలా విషయాలపై స్పందించిన పూరీ జగన్నాథ్  తాజాగా నో మోర్ కిల్లింగ్ అంటూ జంతు హత్యలను మానేయాలని... మాంసం కోసం జంతువులను చంపాల్సిన అవసరం లేదని... కల్చరింగ్ మీట్ అనే ప్రాసెస్ వచ్చిందని చెబుతున్నారు పూరీ జగన్నాథ్. ‘‘మ‌న‌లో చాలా మంది వెజిటేరియ‌న్స్‌ గా ఉండ‌టానికి కార‌ణం, రోజూ మ‌నం తినే తిండి కోసం జంతువుల‌ను చంప‌డం ఇష్టం లేకపోవ‌డ‌మే. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా చికెన్ తిన‌మంటే లొట్ట‌లేసుకుంటూ తింటారు కానీ... కోడిని కోయ‌మంటే వారు కోయ‌లేరు. అందుకే ఈ ప్ర‌పంచానికి ఓ క‌సాయివాడు కావాలి. హ్యుమ‌న్ తినే తిండి కోసం చేపలు, కోళ్ళు, మేక‌లు, గొర్రెలు, పందులు, ఆవులు... ఇలా అన్నింటినీ క‌లిపి మూడు బిలియ‌న్ జంతువుల‌ను మ‌నం చంపుతున్నాం. ఇది చాలా దారుణం అని పూరి అన్నారు. అయితే ఈ సమస్యకి పూరి పరిష్కారం కూడా చెప్పారు. ఇజ్రాయిల్ సైంటిస్టులు క‌ల్చ‌రింగ్ మీట్‌ అనే కొత్త ప‌ద్ధ‌తిని క‌నిపెట్టారు అని ఏ జంతువునూ పెంచాల్సిన అవ‌స‌రం లేదు చంపాల్సిన అవ‌స‌రం లేదు. ల్యాబ్‌లో మీకు కావాల్సిన మాంసాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. వాటి క‌ణాలుంటే చాలు. బ‌యో రియాక్ట‌ర్స్‌లో ఈ మాంసాన్ని క‌ల్చ‌రింగ్ చేస్తారు. మ‌రింత మంచి మాంసాన్ని త‌యారు చేస్తారు అని ఆయన ఈ మ్యూజింగ్ ద్వారా తెలిపారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.