
టాలీవుడ్ లో హీరోస్ కి ఉన్నంత కెరీర్ హీరోయిన్స్ కి ఉండదు. చాలామంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. కొంతమంది ఒక రేంజ్ వచ్చాక వాళ్ళ క్రేజ్ సడన్ గా పడిపోతుంది. అయితే కొంతమంది సీరియల్స్ లో మొదలుపెట్టి ఇంకా సీరియల్స్ లోనే కొనసాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. సీరియల్స్ లో చాలామంది నటిస్తున్న గాని అందులో కొంతమందేనే మన ఇంట్లో మనుషులుగా భావిస్తాం . ఆ లిస్ట్ లో మనకు మొదట గుర్తొచ్చే వారు శ్రుతి.

ఆమె ఎవరు అని అనుకుంటున్నారా? ..తెలుగులో బాగా ఫేమస్ అయిన మొగలి రేకులు సీరియల్ అందరికి బాగా గుర్తుండి ఉంటది. అందులో తమిళం తెలుగు మాట్లాడే ఆవిడనే శ్రుతి గారు. అయితే ఆమె తల్లి కూడా ఎవరో కాదు బాగా పేరున్న నాగమణి గారు. ఒకరోజు శ్రుతి గారు ఆమె తల్లి తో కలిసి సీరియల్ షూట్ కి వెళ్తే అక్కడ ఒక పాత్ర కోసం శ్రుతి గారిని తీసుకున్నారట. ఈ పాత్ర లో ఆమె నటనకి అందరి దగ్గరనుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.

అయితే ఆమె తల్లి నాగమణి గారు మాత్రం సీరియల్స్ వల్ల శ్రుతి గారి చదువు పాడవకూడదు అని సీరియల్స్ లో మానిపించింది. అయితే తన హాలిడేస్ లో మాత్రం సీరియల్స్ లో చేయమని అనే షరతుకు ఒప్పుకుంటేనే నాగమణి గారు ఆమె నటించడానికి ఒప్పుకున్నారు.ఆ తర్వాత శ్రుతి గారికి వరసగా ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఆమె కెరీర్ లో బాగా మంచి పేరు తెచ్చింది మాత్రం దూరదర్శన్ లో నటించిన ఋతురాగాలు లోని ఆమె పాత్ర.

ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరి తన కెరీర్ మొదట్లో చేసిన సీరియల్ లో కూడా ఆమె మొదటి హీరోయిన్ గా నటించింది. ఇక ఆమె నటించిన మొగలిరేకులు , చక్రవకం లాంటి సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఆమె అప్పుడప్పుడు సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అందరిని మెప్పిస్తుంది. పూరి జగన్నాథ్ గారు దర్శకత్వంలో వచ్చిన కెమరామెన్ గంగతో రాంబాబు సినిమాలో కూడా ఆమెకి మంచి పాత్ర ఇచ్చారు పూరి జగన్నాథ్.