ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ అందరూ 2021కి స్వాగతం చెబుతున్నారు. మరోవైపు చాలా మంది సెలెబ్రిటీస్ న్యూ ఇయర్ వేడుకలకు తమకు ఇష్టమైన వారితో జరుపుకుంటున్నారు. ఇక తెలుగులో యంగ్ జంట నాగ చైతన్య, సమంత తమ కొత్త సంవత్సర వేడుకలను గోవాలో జరుపుకున్నారు. ఈ మద్యనే ఇద్దరు కలిసి గోవాకు వెళ్లి అక్కడే న్యూ ఇయర్ వేడుకలను చేసుకున్నారు. వారి సెలెబ్రేషన్స్ లో ఒక ఫోటో ని నాగ చైతన్య తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోలో సమంత, నాగ చైతన్యని ప్రేమతో ముద్దు ఇస్తూ కనిపించింది. మా తరపున నుంచి మీకు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ప్రస్తుతం నాగచైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీలో నటించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా.. ఇటీవలే మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. త్వరలోనే లవ్ స్టోరీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు. అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యులో నటించనున్నారు చైతన్య. థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.