
సినీ ప్రేక్షకుల కోరికల్లో ఒకటి మహేష్ బాబు, రాజమౌళి కలిసి సినిమా చేయాలని. వీళ్ళ కంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత వీరి సినిమా ఒకే అయ్యింది. మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు రాజమౌళి గారే స్వయంగా ప్రకటించారు. నారాయణ్ నారంగ్ గారు ఈ భారి ప్రాజెక్ట్ ను నిర్మిస్తారని కూడా చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలేవీ ఇంకా తెలియలేదు.

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి, సర్కారువారి పాట చిత్రంతో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. రాజమౌళి ఎప్పుడూ తన తదుపరి ప్రాజెక్ట్ ను ఒక ప్రాజెక్ట్ పూర్తయ్యి, రిలీజ్ అయిన తర్వాతే అనౌన్స్ చేస్తారు. కాని మహేష్ తో ప్రాజెక్ట్ ఉంటుందని గత ఏడాది లాక్ డౌన్ లోనే అనౌన్స్ చేసాడు. అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఏమైనా వస్తాయేమో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు సర్కారువారి పాట తర్వాత ఇంకో సినిమాని అనౌన్స్ చేయలేదు అంటే ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా పట్టలెక్కబోతోందన్న మాట.

ఆర్.ఆర్.ఆర్ ఈ ఏడాది ఆక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మహేష్ బాబు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో తన సర్కారువారి పాటను నిలబెట్టనున్నాడు. అంటే ఈ ఏడాదిలో ఇద్దరూ ఫ్రీ అయిపోతారు కాబట్టి ఈ ఏడాది చివర్లో కాని వచ్చే ఏడాది మొదట్లో కాని ఈ సినిమా పట్టలేక్కే చాన్స్ ఉంది. అయితే ఈ చిత్రానికి రైటింగ్ వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. సినిమా దాదాపు విదేశాల్లో జరుగుతుందని మహేష్ బాబు క్యారేక్టర్ మరో లెవెల్లో ఉంటుందని టాక్ నడుస్తోంది. మరి ఈ చిత్రంతో మహేష్ బాబుని రాజమౌళి ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో వేచి చూడాలి.