
సమంత అక్కినేని హోస్ట్ గా చేస్తోన్న షో సామ్ జామ్. ఈ షో ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చిన సంగతి తెల్సిందే. దీనికి రెస్పాన్స్ బాగుంది. ఇక రెండో ఎపిసోడ్ కు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, రానా దగ్గుబాటి గెస్ట్ లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోలో విడుదలవ్వగా ఇందులో రానా వస్తూనే సమంతను పంపించేసాను అంటూ ఉండగా స్యామ్ పరిగెత్తుకుంటూ వచ్చి హోస్ట్ నేను మీరు గెస్ట్ సీట్ లో కూర్చోండి అంటూ నవ్వులు పూయించారు. అలానే రానా ఆరోగ్యం గురించి తెలిసిన కొన్ని సంగతులు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. రానా ఆరోగ్యం విషయంలో వచ్చిన రూమర్స్ ఈనాటివి కావు. రానాకు కిడ్నీ సమస్య వచ్చిందని, అందుకోసమే తన సినిమా షూటింగ్ లు మానుకుని యూ.ఎస్ కు వెళ్లి చికిత్స తీసుకున్నాడని అన్నారు. దీనిపై వార్తల్లో నిజమెంతో ఎవరికీ తెలీదు ఎందుకంటే రానా ఒక్కసారి కూడా ఈ విషయంలో ఓపెన్ అవ్వలేదు. అయితే సామ్ జామ్ ఎపిసోడ్ లో మాత్రం వీటిపై స్పందించాడు. కాస్త ఎమోషనల్ అవుతూ "నాకు పుట్టినప్పటి నుండే బిపి ఉంది. దీనివల్ల గుండె సమస్య వస్తుందని, కిడ్నీలు కూడా పాడవుతాయని అన్నారు. స్ట్రోక్ హేమరేజ్ వచ్చే అవకాశాలు 70 శాతం చనిపోవడానికి 30 శాతం అవకాశాలు ఉన్నాయని చెప్పారు." అని రానా అనడంతో అక్కడున్న వారు అంతా ఎమోషనల్ అయ్యారు.
And here’s a glimpse a sneak peek into high and low! ❤️ https://t.co/iRjtGiG8eP
— Rana Daggubati (@RanaDaggubati) November 23, 2020