ఆయన పెళ్ళిలో ఈ ముగ్గురూ హైలైట్ అయినట్లు ఉన్నారు!

అదిరింది, విజిల్ మరియు తెలుగు చిత్రం క్రాక్‌లో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సినిమాటోగ్రాఫర్ జి.కె విష్ణు - పి.మహాలక్ష్మి వివాహం (ఆదివారం 25-04-2021) చోలింగనల్లూర్ ఇస్కాన్ ఆలయంలో జరిగింది. కరోనా కారణంగా, వరుడి తల్లిదండ్రులు మరియు అతి ముఖ్యమైన బంధువులు మరియు స్నేహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆహ్వానించిన ముఖ్యమైన అతిథుల్లో కీర్తి సురేష్, వరలక్ష్మి, మలినేని గోపీచంద్ లు విచ్చేసి వధూవరుల్ని సంతోష పరిచారు.

ఈ వేడుకలో వీళ్ళు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి ఫోటోలు బయటికి వస్తే వెంటనే నేట్టింట్లో హల్చల్ చేస్తాయి. అందులోనూ స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్స్ అయితే ఆ రీచ్ మరో లెవెల్లో ఉంటుంది. కీర్తి సురేష్, వరలక్ష్మి మంచి స్నేహితులు. ఇద్దరూ విజయ్ నటించిన సర్కార్, విశాల్ నటించిన పందెం కోడి-2 సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఇక గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన క్రాక్ చిత్రంలో నెగిటివ్ పాత్రలో మెప్పించింది వరలక్ష్మి.

ముగ్గురూ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. హీరియిన్ గా కీర్తి సురేష్ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం మూడు భాషల్ని కవర్ చేస్తోంది ఈ భామ. అలాగే ఆమె నటించిన గత చిత్రాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇక వరలక్ష్మి విషయానికి వస్తే ఆమె చేతిలో ఏకంగా 7 సినిమాలు ఉన్నాయి. క్రాక్ హిట్ తర్వాత ఈ భామకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈమె కూడా తెలుగు, తమిళ్, కన్నడ మూడు భాషల్ని కవర్ చేస్తోంది. క్రాక్ తర్వాత గోపీచంద్ ఇంకా తన తదుపరి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్థుతానికి సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ముగ్గురూ కూడా సినిమాలతో బిజీగా ఉండాలని కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.