2015లో ఇండస్ట్రీ కోల్పోయిన కళామాతల్లి బిడ్డలు వీళ్ళే

జీనవ్మరణాలు అనేవి సహజం ఎలాంటి వారైనా సరే చావుకు తలవంచక తప్పదు. గరీబ్ అయినా నవాబ్ అయినా నసీబ్ బ్యాడ్ అయితే ఎవరూ దాన్ని మార్చలేరు. చిత్ర పరిశ్రమ దీనికి అతీతం కాదు ఎంతో మంది అలా అర్ధాంతరంగా తనువులు చాలించిన వారు ఉన్నారు. కరోనా కారణంగా ఎందరో మహానుభావులు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కాని కరోన సమయంలో ఎంత మంది సినీ కళాకారులు చనిపోయారో 2015లో కూడా అంతే మంది ప్రాణాలు కోల్పోయారు.
నిర్మాత, దర్శకుడు జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత రాజేంద్రప్రసాద్ జనవరి 12న శ్వాస సంబంధిత సమస్యతో మరణించారు. ఆయన నిర్మించిన సినిమాలకు నేషనల్ అవార్డ్లను కూడా అందుకున్నారు. ఇక మూవీ మొఘల్ గా అన్ని భాషల్లో సినిమాలు తీసి గిన్నీస్ బుక్ ఎక్కిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఫిబ్రవరి 18న ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. దాదాపు 150సినిమాలు నిర్మించి ఎందరినో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

1700కి పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఎం.ఎస్ విశ్వనాథన్ 87 ఏళ్ల వయస్సులో జులై 14న శ్వాస సంబంధిత సమస్య వల్ల కన్నుమూశారు. ఎన్నో చిత్రాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎ. విన్సెన్ట్ కూడా 86ఏళ్ల వయస్సులో ఫిబ్రవరి 25న మరణించారు. ఇక శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సీతాకోక చిలుక వంటి సినిమాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు గారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆక్టోబర్ 4న మరణించారు. రుద్రవీణ లాంటి సినిమాలకి మాటలు రాసిన సీనియర్ రచయిత గణేష్ పాత్రో కేన్సర్ తో పోరాడుతూ జనవరి 5న మరణించారు.


వారితో పాటు ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన  టాప్ కమెడియన్ ఎమ్.ఎస్. నారాయణ జనవరి 23న మరణించారు. జనవరి 4న కేన్సర్ తో ఆహుతి ప్రసాద్ చనిపోయారు.

ఆహుతి సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మొదట్లో విలన్ గా మెప్పించి తర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా ఎన్నో పాత్రలలో మెప్పించారు. నేషనల్ అవార్డు గ్రహీత ఎడిటర్ టీ.ఈ కిషోర్ మార్చి 6న 32ఏళ్ల వయస్సులో బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. గాయం, సింధూరం, ఆవిడా మా ఆవిడే వంటి సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏప్రిల్ 18న మరణించారు. సౌండ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి ఏప్రిల్ 20న హార్ట్ ఎటాక్ తో మరణించారు.

స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆర్తి అగర్వాల్ సర్జరీ ఫెయిల్ కావడంతో కన్నుమూశారు. అలాగే నటుడు మాడా వెంకటేశ్వరరావు, కమెడియన్స్ కళ్ళు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు, దేవిశ్రీ ప్రసాద్ తండ్రి రచయిత సత్యమూర్తి, థియేటర్ ఆర్టిస్టు చాట్ల శ్రీరాములు, సీనియర్ నటుడు రంగనాధ్ కూడా ఆ ఏడాది మరణించారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.