మనోళ్ళు కూడా మొదలెట్టేసారు..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోన గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. కరోనాతో దేశం మొత్తం అల్లకల్లోలం అయ్యింది. రోజుకు ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు. ఇంకేంతోమంది ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఈ మహమ్మారిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. డాక్టర్లు, నర్సులు, సేవ కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు ఈ సాముహిక యుద్ధంలో ప్రజలకు అండగా ఉంటూ ముందు వరసలో నిలబడి యుద్ధం చేస్తున్నారు.

ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనే ప్రభుత్వాలకు సహాయం ఎంతో అవసరం అవుతుంది. దేశ వ్యాప్తంగా ఎంతోమంది తమ వంతు సహాయం చేస్తున్నారు. సోనూ సూద్ మొదలుపెట్టిన పనిని కొనసాగిస్తూ ఎందరో నటులు, చిత్ర పరిశ్రమకి చెందిన వారు తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇటీవలే తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కతాటి పైకి వచ్చి ఎవరికి తోచిన లెక్కని తమిళనాడు సి.ఎంకి విరాళంగా అందజేసారు. అలానే మన వాళ్ళు కూడా ఒక్కోకరిగా తమ సహాయాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలకు అందజేస్తున్నారు.

సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎవరికి ఎటువంటి సహాయం కావాలో వారికి అది అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కొందరు కరోన పేషంట్లకు భోజనాన్ని అందిస్తున్నారు. యువ హీరో నిఖిల్, రచయిత కోన వెంకట్ ఇలా మన వాళ్ళు కూడా రంగంలోకి ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సినీ ప్రముఖుల నుండి కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు వస్తుండడంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.