
సూర్య నటించిన తాజా చిత్రం ఆకాశం నీ హద్దురా. ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సూర్య నటించిన గత కొన్ని సినిమాలు పూర్తి ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆకాశం నీ హద్దురా సినిమా సూర్య కెరీర్ కు చాలా కీలకం. ఈ సినిమా విడుదల దగ్గరనుండి అందరి వద్ద నుండి పాజిటివ్ రివ్యూలనే అనుకుంది. ఇటు సామాన్యులు అటు సెలబ్రిటీలు ఆకాశం నీ హద్దురా చిత్రానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ సినిమాను చూసి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో తమకు ఈ చిత్రం ఎంతగా నచ్చిందో ట్వీట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండలు ఈ సినిమా చూసి చాలా గొప్పగా పొగిడారు. కన్నడ స్టార్ హీరో సుదీప్, లక్ష్మి మంచు, ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, సూర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన సత్యదేవ్, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మోహన్ బాబు, రాధికా వంటి వారు ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు.చాలా కాలం తర్వాత ఓటిటిలో మంచి సినిమా విడుదల కావడంతో అందరూ ఈ చిత్రాన్ని చూస్తున్నారు.