మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చరణ్‌కు పాజిటివ్ వచ్చిన తర్వాత తాను కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని.. నెగెటివ్ వచ్చిందని పేర్కొన్నారు. కానీ, తనకు పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్లో ఉన్నానని, వేడి నీరు, ఆవిరి పట్టడం విశ్రాంతి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఈమె చేసే పోస్ట్ లు కూడా మెగా రెంజ్ లోనే ఉంటాయ్. అయితే తాజాగా ఉపాసన కొణిదెల వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తన తల్లి శోభనా కామినేని సైకిల్ రైడింగ్ జర్నీ వుంది. సైకిల్ రైడింగ్ అంటే చిన్న చితక రైడింగ్ కాదు ఏకంగా ఆరువందల కిలోమీటర్లకు పైగా సైకిల్ పై ప్రయాణం చేసింది. ఈ వీడియోలో శోభనా సైకిల్ జర్నికి సంబంధించి వుంది. ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఉపాసన తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. ఆరు పదుల వయస్సులో కూడా తనని తాను చాలెంజ్ చేసుకుని ఈ సైకిల్ రైడ్ చేసింది అని చెప్పింది. ఈ సైకిల్ రైడ్ హైద్రాబాద్ నుండి చెన్నై వరకు సాగింది.