క్వారంటైన్ లో రామ్ చరణ్, ఉపాసన

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ భర్య ఉపాసన కొణిదెల తన ఆరోగ్య స్థితిపై అప్ డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అని వెల్లడైన నేపథ్యంలో తాను కూడా కరోనా టెస్టులు చేయించుకున్నానని ఉపాసన తెలిపారు. కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతానికి లక్షణాలేవీ లేవని స్పష్టం చేశారు. అయితే తనకు కరోనా పాజిటివ్ వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రామ్ చరణ్ సినిమా అప్ డేట్స్ తో పాటు హెల్త్ కి సంబంధించి టిప్స్ మరియు ఆహార నియామాల గురించి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ లు పెడతూ ఉంటారు. తాజాగా రామ్ చరణ్ తో కలిసి  సాయంత్రం పూట  ఉపాసన తీసుకున్న ఫోటో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు మిస్టర్ సి (రామ్ చరణ్) తో కలిసి హోం క్వారంటైన్ లో ఉన్నానని, మిస్టర్ సి బలంగా పుంజుకుంటున్నారని ఉపాసన వెల్లడించారు. అలాగే ఆవిరి పట్టడం, వేడి పానియాలు తీసుకోవడం చేస్తున్నారని ఉపాసన కొణిదెల చెప్పుకొచ్చారు. తొందర్లో రామ్ చరణ్ కి కొవిడ్ నెగెటివ్ వచ్చె అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్, ఆర.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలు చేస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.