ఖుషి:
ఒకరంటే ఇంకొకరికి ఇష్టం.కాదు.. ప్రేమ. కానీ ఆ ప్రేమ ని పైకి చెప్పలంటే మాత్రం అడ్డొచ్ఛే "ఇగో". ఇది ఈ సినిమా కథాంశం. మనం ప్రేమించిన వాళ్ళని వేరే వాళ్ళతో చూస్తే సహించలేం అలా అని మన ప్రేమ ని బయటకి చెప్పం. చెప్పాలంటే మన ఇగో ఒప్పుకోదు. ఇలాంటి పాయింట్ తోనే ఇద్దరి మధ్య ప్రేమ ని చాలా చక్కగా చూపించిన సినిమా.
నువ్వే కావాలి
చిన్నప్పటి నుండి కలిసి ఫ్రెండ్స్ లాగా పెరిగిన అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా థీమ్. మళ్ళీ హీరో ని లవ్ చేసే ఒకమ్మాయి, హీరోయిన్ ని లవ్ చేసే ఇంకో అబ్బాయి.. ఆ ఇద్దర్నీ వేరు చేయడానికి వచ్చినట్లు ఉంటారు. చివరికి హీరో హీరోయిన్ ఎమోషనల్ గా ఒకటయ్యే క్లైమాక్స్ తో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది మూవీ కి. తరుణ్ ని స్టార్ హీరో ని చేసింది ఈ సినిమా.
అందాల రాక్షసి:
సూర్యుడి చుట్టూ తిరిగే భూమి. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు.. వీటి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టిన ప్రేమ కథ ఈ అందాల రాక్షసి. గౌతమ్ మిధున ని ప్రేమిస్తాడు కానీ మిధునకి సూర్య ముందుగా పరిచయం అవుతాడు. సూర్య చనిపోవడం.. తర్వాత మిధున గౌతమ్ ని పెళ్లి చేసుకోవడం.. సూర్య బతికే ఉన్నాడు అని తెలియటం.. చివర్లో గౌతమ్ చనిపోవడం.. ఇలా సాగుతుంది కథ. సూర్యుడు, చంద్రుడు భూమి ని ప్రేమించినా కానీ ఎప్పటికీ దగ్గర కాలేవు అని చెప్పడం ఈ చిత్ర దర్శకుడి ఉద్దేశ్యం.
తీన్ మార్:
"పెళ్లి కి ముందు ఇష్టం వచ్చినట్లు తిరిగేసి, మోజు తీరాక ఒకరినొకరు వదిలేసి వేరే వాళ్ళని చూసుకునే రోజులు ముందు ముందు వస్తాయేమో తెలియదు.. అలాంటి రోజే వస్తే బతికుండటం కన్నా చాచిపోవడానికే ఇష్టపడతాను." అర్జున్ పాల్వాయి చెప్పినట్లు ఇప్పటి పరిస్థితుల్లో ప్రేమ ఎలా ఉందో మైఖేల్ పాత్ర ద్వారా చూపిస్తూ ఇంకో పక్క 30 సంవత్సరాల క్రితం ప్రేమలు ఎలా ఉండేవో చూపించిన చిత్రం. ఏవో కొన్ని రీజన్స్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయింది కానీ ఫీల్ గుడ్ మూవీ.
ఏ మాయ చేసావే:
"ప్రపంచం లో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీ నే ఎందుకు లవ్ చేశాను".
లాంటి సింపుల్ డైలాగ్స్ తో చాలా డెప్త్ ఉన్న లవ్ స్టొరీ. నాగ చైతన్య, సమంత కెరీర్ లో మోస్ట్ మెమొరబల్ ఫిల్మ్.. క్లాసిక్ లవ్ స్టొరీ.
ఆరంజ్:
టీనేజ్ నుండి వరసగా పది మంది అమ్మాయిలని లవ్ చేసిన ఒక ప్లే బాయ్ కథ ఈ ఆరంజ్. ప్రేమిస్తే అబద్దాలు చెప్పాలా.. మనకి ఇష్టం లేని పనులు కూడా లవర్ కోసం చేయాలా.. క్యారెక్టర్ ని మార్చుకోవాలా.. అవన్నీ లేకుండా ప్రేమించలేమా.. ప్రేమించొచ్చు కానీ "ప్రేమ కొంత కాలమే బాగుంటుంది". ఇలాగే ఆలోచించే "World's greatest lover స్టోరీ. సినిమా ప్లాప్ కానీ చాలా మందికి ఫేవరేట్ ఫిల్మ్.. మ్యూజిక్ గురించి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు..
ఇష్క్
చాలా సంవత్సరాలు తర్వాత నితిన్ కి హిట్ ఈ సినిమాతో వచ్చింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ స్పెషల్ హైలైట్ దీనికి. నితిన్, నిత్య పెయిర్ కూడా చాలా బాగుంటుంది.
అర్జున్ రెడ్డి
ట్రెండ్ సెట్టర్ అంటే చాలు అంతకు మించి ఏమి చెప్పక్కర్లేదు దీని గురించి. కల్ట్ లవ్ స్టొరీ గా ఆడియన్స్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
మళ్ళీ రావా
వెరీ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్ మూవీ ఇది.. మూడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో సేమ్ లవర్స్ మధ్య జరిగే కథ.. మూడు సార్లు ఎలా కలిసి విడిపోయారో చెప్పిన కథ. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ కామెడీ..