A bright shining star was born today.
— Sampath Nandi (@IamSampathNandi) December 21, 2020
Here’s our team wishing you love, power n health in abundance n a #SeetimaarrFULL 2021💥Looking fwd to scoring a hattrick with you✌🏽
Happy birthday dear @tamannaahspeaks🥳#Seetimaarr #HappyBirthdayTamannaah pic.twitter.com/lWX1Gekv2h
మిల్కీ బ్యూటీ తమన్నా గోపీచంద్ సరసన సీటిమార్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. తమన్నా ఈ చిత్రంలో మహిళల కబడ్డీ టీమ్ కోచ్ గా విభిన్నమైన పాత్రను పోషిస్తోంది. ఈ రోజు తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ ఆమె పాత్రను కూడా పరిచయం చేసారు. జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా కనిపించనుంది. తమన్నా ఫోకస్డ్ గా ఉన్న పోస్టర్ ను ఈ సందర్భంగా విడుదల చేసారు. ఈ చిత్రం కాకుండా సత్యదేవ్ హీరోగా గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా తమన్నా నటిస్తోంది. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు కాగా కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టైల్ చిత్రానికి ఇది అధికారిక రీమేక్. ఈ రెండు సినిమాలు కాకుండా ఓ.టి.టిలోకి కూడా తమన్నా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన వెబ్ సిరీస్ గురించిన వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి. ఇలాగే తన అందం, అభినయంతో తమన్నా మరిన్ని సంవత్సరాలు మనల్ని అలరించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే తమన్నా.