కన్నడ బ్యూటీ రష్మిక మండన్న తెలుగులో చాలా తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. వరసగా హిట్ సినిమాల్లో నటిస్తూ రష్మిక బిజియస్ట్ నటిగా మారిపోయింది. ఈ ఏడాది రెండు భారీ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక మరో రెండు ప్రామిసింగ్ సినిమాల్లో నటిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్పలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెల్సిందే. ఇక శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ఆడాళ్ళూ మీకు జోహార్లు సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇక సోషల్ మీడియాలో రష్మిక చేసిన పోస్ట్ విషయానికొస్తే జయించండి అంటూ తన లేటెస్ట్ లుక్స్ తో ఇంప్రెస్ చేస్తోంది రష్మిక. ఒక అందమైన చీర, దానికి సరిగ్గా సరిపోయే స్లీవ్ లెస్, ప్రింటెడ్ జాకెట్, వాటికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ తో రష్మిక లుక్స్ భలే ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఇంతకీ ఈ అమ్మడు దేన్ని జయించమంటోందో సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు మరి.