సోషల్ మీడియాలో మన సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో మోస్ట్ క్రేజియస్ట్ ఫోటోలు పెట్టడంలో అదా శర్మ ముందుంటుంది. తన క్యూట్ లుక్స్ తో అదా శర్మ హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా అరంగేట్రం చేసి అందరినీ విపరీతంగా ఆకర్షించింది. అయితే తన కెరీర్ ను సరిగ్గా టర్న్ చేసుకోవడంలో అదా శర్మ విఫలమైందనే చెప్పాలి. క్యారెక్టర్ పాత్రలకు చాలా త్వరగా టర్న్ చేసుకోవడం అదాకు నెగటివ్ అయ్యింది. గతేడాది కల్కి సినిమాలో నటించింది అదా. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేసింది లేదు. అయితే బాలీవుడ్ నుండి ఈ భామకు ఆఫర్లు వస్తున్నాయ్. ఇక ఈమె సినిమాల సంగతి పక్కనపెడితే, సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలను పెట్టడంలో ముందుంటుంది. తన హాట్ ఫోటోలకు తోడు ఈ వెరైటీ ఫోటోలు ఆమెకు ఫాలోయర్స్ సంఖ్యను పెంచుతోంది. ఇక అదా శర్మ లాస్ట్ పోస్ట్ తీసుకుంటే డిఫరెంట్ మీసం లుక్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతటితో అయిపోలేదు తన తర్వాతి సినిమా విశేషాలను చెబుతాను అంటూ ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. రేపు ఆ సినిమా విశేషాలను అందిస్తానంటోంది.