పురాణ కవి తెనాలి రామకృష్ణ వినోదం, నాటకం మరియు కామెడీతో నిండిన చారిత్రక కల్పనతో తీసిన ధీర: బుద్ధి రిద్ధి సిద్ధి అనే ప్యాన్ ఇండియన్ మోషన్ క్యాప్చర్ యానిమేషన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీషుతో సహా 12 భాషల్లో విడుదలైంది. ఇది పిల్లలకు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారికి వినోదభరితమైన చిత్రం. ఈ సినిమాని హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళు తీయడం ఇంకో విశేషం. అరుణ్ కుమార్ రాపోలు స్థాపించిన, హైదరాబాద్ నుండి వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ కంపెనీ ఎ-థియరమ్ స్టూడియో నిర్మించిన అద్భుతం ఈ చిత్రం. ఈ మొత్తం ప్రాజెక్టును 12 భాషలలో తీసిన దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ ప్లే రచయిత అరుణ్. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇంకో ట్రైలర్ ని మూవీ టీం విడుదల చేసారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి తెనాలి రామకృష్ణకి తమ ఆకర్షణీయమైన స్వరాన్ని జోడించి, ప్యాన్ ఇండియాను తీసుకొని సినిమాను సాధ్యం చేసిన సూపర్ స్టార్స్ వివేక్ ఒబెరాయ్ (హిందీ), మక్కల్ సెల్వన్ విజయసేతుపతి (తమిళం), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (తెలుగు) , సూపర్ స్టార్ జీత్ (బెంగాలీ) యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా (కన్నడ), సూపర్ స్టార్ స్వప్నిల్ జోషి (మరాఠీ), ఉస్తాద్ యువరాజ్ హన్స్ (పంజాబీ), అస్కర్ అలీ ఖాన్ (మలయాళం), సూపర్ స్టార్ ప్రతీక్ గాంధీ (గుజరాతీ), సూపర్ స్టార్ సబ్యసాచి మిశ్రా (ఓడియా), శ్రీ నగేష్ ( భోజ్ పురి ) ఆశిష్ బండారి (ఇంగ్లీష్ ). ఇప్పటివరకు ఈ చిత్రం 10 భాషల్లో విడుదలైంది, ఒడియా మరియు భోజ్‌పురి వెర్షన్లు ఇంకా విడుదల కాలేదు.