తమిళ, కన్నడ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంచిత శెట్టి తన ఫొటోషూట్స్ తో అందరి కళ్ళు తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. తను ఈ మద్యనే మై సౌత్ దివా 2021 క్యాలెండర్ కోసం ఒక ఫోటోషూట్ లో పాల్గొన్నారు. తన క్యూట్ నవ్వుతో సంచిత ఈ ఫోటోషూట్ లో చలాకీగా కనిపించింది. ఈ ఫోటోషూట్ మేకింగ్ వీడియోని మై సౌత్ దివా యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేసారు. ఈ వీడియోలో సంచిత శెట్టిని అందంగా ఎలా క్యాప్చర్ చేశారో చూడొచ్చు. ఈ ఫోటోషూట్ కోసం డ్రోన్స్ ని, ప్రత్యేకమైన కెమెరాలని వాడారు. గోవా లోని అందమైన రిసార్ట్ అలాగే బీచ్ దగ్గర ఈ ఫోటోషూట్ జరిగింది. ఈ ఫోటోషూట్ లోని షాట్స్ లలో సంచిత చాలా అందంగా కనిపించింది. ఈ ప్రత్యేకమైన ఫోటోషూట్ ని ప్రముఖ ఫోటోగ్రాఫర్ మనోజ్ నిర్వహించారు. ఈ ఫోటోషూట్ ఫొటోస్ మై సౌత్ దివా 2021 క్యాలెండర్ లో రాబోతున్నాయి. ఈ మేకింగ్ వీడియోని సంచిత తన సోషల్ మీడియా ద్వారా సూపర్ ఫన్ షూట్ అని పోస్ట్ చేసింది.ఇప్పటికే మై సౌత్ దివా క్యాలెండర్ కోసం మాళవిక శర్మ ఫోటోషూట్ జరిగింది. ఇక మై సౌత్ దివా ఛానల్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరోయిన్స్ ఫోటోషూట్స్ మేకింగ్ వీడియోస్ ని ప్రత్యేకంగా పోస్ట్ చేస్తుంటారు.