— Rajinikanth (@rajinikanth) December 29, 2020
తన సినిమాలతో సంచాలనలు సృష్టించే సూపర్ స్టార్ రజినీకాంత్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. డిసెంబర్ 31 న పార్టీని ప్రారంభిస్తారు అనుకున్న అందరికి రజినీకాంత్ గారు ఒక షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అన్నాత్తే షూటింగ్ లో ఉన్నవారికి కరోన సోకడంతో ఆయన కూడా టెస్ట్ చేయించుకోగా నెగెటివి రావడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కాని ఆయన బీ.పి ఫ్లక్చువేట్ అవ్వడంతో హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీస్కుని వెంటనే డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. హాస్పిటల్ నుంచి వచ్చిన రజినీకాంత్ గారు ఆయన రాజకీయాల్లోకి రావడంలేదు అని ఒక ప్రెస్ నోట్ ని తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు."నేను రాజకీయ పార్టీని ప్రారంభించిన తరువాత ప్రచారం కోసం న్యూస్ మీడియా, సోషల్ మీడియాను బట్టి రాజకీయాల్లో తిరుగుబాటు తీసుకురావడం, పెద్ద విజయాన్ని సాధించడం అసాధ్యం. రాజకీయాల్లో అనుభవం ఉన్నవారు ఈ వాస్తవాన్ని ఖండించరు. నేను ప్రచారం కోసం ప్రజల వద్దకు వెళ్లాలి. వేలాది, లక్షలాది మందిని కలవాలి. 120 మంది అన్నాత్తే సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకింది. ఇక నేను మూడు రోజులు వైద్యుల పరిశీలనలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా రూపం మార్చుకుంది. వేరియంట్ వేగంగా వ్యాప్తి అవుతోంది. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చినా, నేను రోగనిరోధక మందులను తీసుకున్నప్పటికీ నా ఆరోగ్యానికి ఏదైనా జరిగితే, నన్ను విశ్వసించి, నాతో చేరిన వ్యక్తులు మానసికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించానని, ప్రజలు అడుగుతారని, నా స్నేహితులను నేను త్యాగం చేయలేను. నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ నిర్ణయం రజిని మక్కల్ మండ్రాంలో ఉన్నవారికి, నేను రాజకీయాల్లోకి వస్తానని ఊహించిన వారికి నిరాశ కలిగించేది ”అని రజనీకాంత్ గారు ప్రెస్ నోట్ లో రాసారు.