తప్పక చూడాల్సిన పావ కథైగల్

Heinous Crimes in the name of HONOUR ..🙏🏻🙏🏻🙏🏻 hope this attempt opens our conscience.. thank you @NetflixIndia for being...

Posted by Prakash Raj on Thursday, December 3, 2020

ఓ.టి.టిల్లో ఇప్పుడు మంచి కంటెంట్ వస్తోంది. థియెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వకపోయినా
థియెటర్ కి సరితూగే కంటెంట్ వస్తోంది. ఈ కరోనా కాలంలో అందరూ వెబ్ మూవీస్, వెబ్ సీరీస్ లు
తీస్తున్నారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ స్టార్ యాక్టర్స్ కూడా చేస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో పావ కథైగల్
అనే అంథాలజీ సినిమా విడుదలైంది. హిందీలో లస్ట్ స్టోరీస్ తో మొదలైంది ఈ ట్రెండ్. పావ కథైగల్
నాలుగు కథలతో సాగుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సినిమా మంచి ఆదరణ పొందుతుంది.
ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నలుగురు దర్శకులలో వెట్రిమారన్ ఉండండతో క్రేజీ ప్రాజెక్ట్
గా మారింది. ఈ సినిమాకి నలుగురు దర్శకులు సుధా కొంగర, విఘ్నేష్ శివన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్,
వెట్రిమారన్ పని చేసారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సాయిపల్లవి, సిమ్రన్, అంజలి తదితరులు
నటించారు. ఈ కథలన్నీ పరువు, సమాజం, ప్రేమ, కులం నేపథ్యంలో సాగుతాయి. వెట్రిమారన్ దర్శకత్వం
వహించిన కథ లో ప్రకాష్ రాజ్, సాయి పల్లవి తండ్రి కూతుళ్ళు గా అద్భుతమైన నటనను కనబర్చారు.
అలాగే వెట్రిమారన్ దర్శకత్వ ప్రతిభ అమోఘంగా. అలాగే గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన కథ అందర్ని
ఆలోచింపచేసేలా ఉంది. సుధా కొంగర తెరకెక్కించిన కథ కూడా అద్భుతమే. విఘ్నేష్ శివన్
తెరకెక్కించిన లెస్బియన్ స్టోరీ కూడా మంచి సందేశాన్ని ఇస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మొత్తానికి
నెట్‌ఫ్లిక్స్ లో సౌత్ కంటెంట్ హిట్ అయ్యింది

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.