తెలుగులో భారీ ఎత్తున మాస్టర్ విడుదల

కరోన లాక్డౌన్ వల్ల దాదాపు తొమ్మిది నెల‌ల త‌ర్వాత థియేట‌ర్స్ తెరుచుకోవడంతో ఇన్నాళ్ళు ఆగిన సినిమాలు ఇప్పుడిప్పుడే థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాయి. ఈ మద్యనే విడుదలైన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రెస్పాన్స్ చూసి సినిమా నిర్మాతలకి ధైర్యం వచ్చింది. ఈ ఉత్సాహంతో వచ్చే సంక్రాంతికి సినిమాలని విడుదల చేస్తున్నారు సదరు సినిమా నిర్మాతలు. అందులో ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’ సినిమా ఇప్పటికే జ‌న‌వ‌రి 13న అన్ని భాష‌ల‌లో విడుద‌ల అవుతునట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇక మాస్టర్ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కుల్ని మహేష్ కోనేరు తీసుకున్నారు. ఈ సినిమాని తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నాం అని ఆయన తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అలాగే ఆయన మీద నమ్మకం వుంచినందుకు హీరో విజయ్ కి తన పోస్ట్ ద్వారా థాంక్ యూ చెప్పారు. ఇక ఈ చిత్రంలో హీరో విజయ్ కి జోడిగా మాళవికా మోహనన్ నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. ఇక తమిళ్ తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతి మాస్టర్ సినిమాలో విలన్ గా నటించడంతో ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ‘ఖైది’ సినిమాతో సంచలనం సృష్టించిన లోకేష్ కనగారాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం ఈ చిత్రానికి మరో ప్రత్యేకత. ఇప్పటికే విడుదలైన టీజర్ కు, పాటలుకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.