ప్రముఖ కథానాయకుడు శింబు క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘మానాడు’. ప్రసిద్ధ దర్శకులు ఎస్.జె స్రూర్య, కరుణాకరన్, ఎస్.ఏ చంద్రశేఖర్ ముఖ్యపాత్రలో నటించగా, కల్యాణి ప్రియదర్శన్ శింబుకి జంటగా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు టీజర్ ను మాస్ మహారాజ్ రవితేజ, హిందీ టీజర్ ను దర్శకుడు అనురాగ్ కశ్యప్, కన్నడ టీజర్ ను కిచ్చ సుదీప్, తమిళ్ టీజర్ ను ఏ.ఆర్ రెహమాన్, మలయాళ టీజర్ ను పృథ్వీరాజ్ సుకుమారాన్ విడుదల చేసారు. టీజర్ మొదట్నుంచి రివైండ్ వెర్షన్ లో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో వెంకట్ ప్రభు సిద్ధహస్తుడు. సుమారు 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ కామాచ్చి నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించగా రిచర్డ్ ఎమ్, నాథన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.