టైగర్ తో దళపతి సై?

దళపతి విజయ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరూ స్టార్ హీరోస్, మంచి డ్యాన్సర్స్ అంతకుమించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీస్. ఒకరు తమిళంలో స్టార్ అయితే మరొకరు తెలుగులో స్టార్. విజయ్ కి ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో ఎన్టీఆర్ కి తమిళంలో అంతే క్రేజ్ ఉంది. ఇద్దరూ సమవుజ్జీలు అనడంలో ఎటువంటి సందేహము అవసరం లేదు. ఇద్దరూ కూడా వరస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలే కాకుండా తదుపరి సినిమాలు కూడా లైన్ లో పెట్టేసారు.

ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి టాపిక్ ఎందుకంటే త్వరలోనే వీరు తెరను పంచుకోబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరో చెరో రెండు ప్రాజెక్ట్స్ బాకీ ఉన్నారు అవి పూర్తవగానే వీరిద్దరి సినిమా పట్టలెక్కుతుందని సమాచారం. ఎన్టీఆర్ ఆర్.ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండగా దాని తర్వాత కొరటాల శివతో ఒక సినిమాని అనౌన్స్ చేసారు. దాని తర్వాత అయన చేయబోయే సినిమా ఏది అనౌన్స్ కాలేదు. త్రివిక్రమ్ తో సినిమా క్యాన్సిల్ అవగా మరో ఇద్దరు డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. కొరటాల శివ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక విజయ్ కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత మళ్ళీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారని సంచారం. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు అట్లీ అని అంటున్నారు. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.