సూర్యకు కూడా సోకిన కరోన

కరోన భయం ప్రజలను వీడినప్పటికీ, దాని ప్రభావం ఇంకా పోలేదు. చాల మంది నటులు కరోన భారిన పడ్డారు. వారిలో కొందరు ఆ మహమ్మారిని ఎదిరించి జయించగా, కొంతమంది మాత్రం మన దురదృష్టవ శాత్తు ప్రాణాలు వదిలారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పిదాల వల్ల ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. దీని నుంచి స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. మొన్న ఆ మధ్య ప్రముఖ హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు కరోన భారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ నటుడు సూర్య కోవిడ్-19 భారిన పడ్డారు. అకస్మాతుగా చేసిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. “నేను కరోనా భారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతానికి బానే ఉన్నాను, త్వరగా కోలుకుంటున్నాను. మన పరిస్థితులు ఇంకా సాధారణ సతికి రాలేదని అర్ధమైంది. అలాగని భయపడుతూ అక్కడే ఆగిపోలేము, తగిన భద్రతలను పాటిస్తూ మన పనులు చేసుకోవాలి. నా పై ప్రేమ చూపించే అభిమానులకు, నన్ను క్షేమంగా చూసుకుంటున్న వైద్యులకు నా కృతఙ్ఞతలు” అని అయన తన మాటలను పంచుకున్నారు. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాడివాసల్’ చిత్రంలో నటిస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.