#Thalaivar @rajinikanth is back in Chennai. pic.twitter.com/WjI9ET2kVm
— BARaju (@baraju_SuperHit) December 28, 2020
సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. తన ప్రస్తుత చిత్రం అన్నాతై షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా సినిమా యూనిట్ లో 8 మందికి కరోనా సోకడంతో షూటింగ్ ను నిలిపివేశారు. ఇది జరిగిన రెండు రోజులకు బీపీలో అసహజ మార్పుల కారణంగా రజినీకాంత్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రజినీకాంత్ క్రమంగా కోలుకుని నిన్న సాయంత్రం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వెంటనే రజినీకాంత్ హైదరాబాద్ నుండి చెన్నై బయల్దేరి రాత్రి సమయానికి చెన్నై చేరుకున్నారు. ఆయన భార్య లత రజినీని ఇంట్లోకి హారతి ఇస్తూ ఆహ్వానిస్తోన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసుపత్రిలో ఉన్న సమయంలో రజినీ ఆరోగ్యం గురించి ఆయన ఫ్యాన్స్ చాలా కలవరపడ్డారు. ఇప్పుడు అంతా ఓకే అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రజినీ ఆసుపత్రిలో ఉన్న సమయం దగ్గరనుండి ఆయన కూతురు తోడుగానే ఉన్నారు. రజినీకాంత్ 2021 ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ప్రకటించిన విషయం తెల్సిందే.