నామినేషన్ వేసిన కమల్ హాసన్.. ఆస్తులు, చదువు ఎంతో తెలిస్తే షాక్..?

విశ్వా నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నటుడిగా ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసిన కమలహాసన్ రాజకీయాల్లో కూడా అదేవిధంగా ఎన్నో శిఖరాలు అధిష్టించాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.. ప్రస్తుతం అయన భారతీయుడు 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..  దాదాపు ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన సినిమా కి ఇప్పుడు సీక్వెల్ చేయడం విశేషం..  శంకర్ ఈ సినిమా ని తనదైన స్టైల్ లో తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు..  ఈ సినిమా ను ఏ ముహూర్తాన మొదలుపెట్టాడొ తెలీదు కానీ ఆదినుంచి ఈ సినిమాకి అన్ని అడ్డంకులు వస్తున్నాయి..

మొదట్లో నిర్మాతలకు, శంకర్ చెడింది.. ఆ తర్వాత అన్ని సమస్యలు సద్దుమణిగి సినిమా షూటింగ్ మొదలైంది..ఆ తర్వాత సినిమా లో జరిగిన ఓ ప్రమాదం లో ఇద్దరు సినీ కార్మికులు చనిపోయారు.. దాంతో ఈ సినిమాలోని విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి.. కరోనా వల్ల ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇప్పటివరకు తిరిగి ప్రారంభం కాలేదు.. భవిష్యత్ లో అవుతుందో కూడా తెలీదు.. దాంతో శంకర్, కమల్ హాసన్ చెరో ప్రాజెక్ట్ ల్లో బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.  ఈయన అన్నాడీఎంకే, డీఎంకే తరుపన కాకుండా తృతీయ ప్రత్యామ్నాయంగా ఎన్నికల్లో బరిలో దిగారు. తాజాగా జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు.

అంతేకాదు తాజాగా ఈయన సోమవారం అక్కడి నుంచి తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ. 176.93 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నాడు. అందులో స్థిరాస్తులు రూ. 131.84 కోట్లు.. చరాస్థులు రూ. 45.09 కోట్లుగా తెలిపారు. ఇక లండన్‌లో రూ. 2.50 విలువ చేసే ఇల్లు.. రూ. 2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు తనకు రూ. 49.5 కోట్ల అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక విద్యార్హత 8వ తరగతి చదువుకున్నట్టు తెలిపారు కమల్ హాసన్.. 2018 ఫిబ్రవరిలో ఈయన 'మక్కల్ నీది మయ్యం' అనే రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసాడు. కానీ ఈయన పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇపుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఈ సారైనా కమల్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.