బాబీ సింహా లేటెస్ట్ లుక్స్ అదిరిపోతున్నాయిగా

Here are some exclusive working stills from a beautiful song 🎵 shoot for #VasanthaMullai! All new pair #Simha &...

Posted by Bobby Simha on Friday, December 18, 2020

నేషనల్ అవార్డు విన్నింగ్ నటుడు బాబీ సింహా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
తన సహజ నటనతో బాబీ సింహా అదరగొడతాడు. తెలుగులో కూడా బాబీ సింహ ఎంట్రీ ఇచ్చిన విషయం
తెల్సిందే. రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో బాబీ సింహా విలన్ గా నటించాడు. అయితే
కేవలం విలన్ గా మాత్రమే కాకుండా బాబీ సింహా అటు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం
తను ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం వసంత ముల్లై. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రామనన్ పురుషోత్తమ
రూపొందించాడు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాశ్మీర పరదేశి ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి
సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు విడుదలయ్యాయి. హీరో, హీరోయిన్స్ ఈ ఫోటోల్లో
చూడముచ్చటగా ఉన్నారు. ఇక బాబీ సింహా అయితే స్టన్నింగ్ లుక్స్ తో అదిరిపోయాడు. త్వరలోనే ఈ
సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.