Can’t thank you enough for the dream project @beemji Love u sir 😘😘 @KalaiActor @Actorsanthosh @johnkokken1 @Music_Santhosh @anbariv @EditorSelva @kaaliactor @muraligdop @officialdushara Thanks everyone for making this special 🤗🤗😍😍#Alhamdulillah pic.twitter.com/29ak1fUYXI
— Arya (@arya_offl) December 2, 2020
తెలుగులో విడుదలైన డబ్బింగ్ చిత్రాలతోనే ఫేమస్ అయిన తమిళ నటుడు ఆర్య. వాడు వీడు, నేనే అంబానీ సినిమాలతో ఆయనకి టాలీవుడ్ లో బాగా క్రేజ్ వచ్చింది. అలాగే వరుడు సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా ఆర్య కి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు ఆర్య కొత్త చిత్రం రాబోతుంది. సూపర్ స్టార్ రజినికాంత్ గారితో కబాలి, కాళ లాంటి సినిమాలని తీసిన ప రంజిత్ దర్శకత్వంలో ఆర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఈ రోజు ఉదయం 11 గంటలకి విడుదల చేసారు. ఈ సినిమాలో ఆర్య ఒక బాక్సర్ గా కనిపించబోతున్నారు. ఆర్య ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం బాగా శ్రమించి బాడీ పెంచారు. మనం చూసే నిజమైన బాక్సర్ లాగా ఆర్య తయారయ్యాడు. ఆర్య 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాని నీలం ప్రొడక్షన్స్ , కె9 స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా మురళి పని చేస్తున్నారు. మంచి మెసేజ్ ఉన్న కథలతో సినిమాలు తీసే ప రంజిత్ ఈ సారి ఎలాంటి కథతో వస్తున్నారో చూడాలి అంటే విడుదలదాకా ఆగాల్సిందే. ఇక ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కాబోతుంది.