సబ్యసాచి బ్రాండ్ కు పరిచయం అవసరం లేదు. ఏదైనా ఫంక్షన్స్ కు, ముఖ్యంగా పెళ్లిళ్లకు సబ్యసాచి బ్రాండ్ వాడటం ఒక ప్రెస్టీజియస్ విషయం. ఇవి కొంచెం ఖరీదైనవిగా ఉన్నా సబ్యసాచి ప్రొడక్ట్స్ తెచ్చే హుందాతనం, ఆ వినూత్నమైన లుక్ వేరే బ్రాండ్స్ కు రావంటే అతిశయోక్తి కాదు. సబ్యసాచి ముఖర్జీ స్థాపించిన ఈ బ్రాండ్ చాలా తక్కువ కాలంలోనే అందరి ఫస్ట్ చాయిస్ గా మారింది. సబ్యసాచి లెహెంగాస్ ముఖ్యంగా పేరెన్నిక కన్నవి. ఇక లేటెస్ట్ గా సబ్యసాచి అఫీషియల్ ఛానల్ లో పోస్ట్ చేసిన ఒక శారీ చాలా అట్ట్రాక్టీవ్ గా ఉంది. "ఎంబ్రాయిడరీ బోర్డర్స్ తో ఉన్న ఈ ఒక ఆర్గాన్జా చీర ఆకృతి పట్టు జాకెట్టుతో సరిగ్గా సరిపోయింది. సబ్యసాచి హెరిటేజ్ జ్యువలరీ కలెక్షన్ వీటికి సరిగ్గా కంప్లీమెంట్ చేస్తాయి" అని పోస్ట్ చేసారు. ఈ శారీ నిజంగా చాలా అట్ట్రాక్టీవ్ గా ఉంది. ఇది ఆర్డర్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు బుకింగ్స్ కు సంబంధించిన కాంటాక్ట్ ను ఇచ్చారు. మరింకెందుకు ఆలస్యం, సబ్యసాచి బ్రాండ్ లో మీరు కూడా మెరిసిపోండి.