Next stop #gurtundaseethakalam
— Satya Dev (@ActorSatyaDev) December 7, 2020
As always, need all your love and support. @tamannaahspeaks #nagasekhar @kaalabhairava7 pic.twitter.com/ADE2ogbJJF
విభిన్న పాత్రలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, ఎలాంటి పాత్ర ఇచ్చినా నటనలో అందంగా కనిపించే మిల్కీబ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా నాగశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. ఇక ఈ మధ్యనే మేఘా ఆకాష్ ఈ సినిమాలో ఓ కీలకపాత్రను చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక ఈ సినిమా విశేషాల్ని చెప్పడానికి మూవీ టీం ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో తమన్నా, సత్యదేవ్ ఇంకా మూవీ ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా గురించి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో తమన్నా తన రెడ్ డ్రస్ తో చాలా అందంగా కనిపించారు. సత్యదేవ్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, ఇన్ని రోజులు కత్తులతో ఎక్కువ నటించానని చాలా రోజుల తర్వాత ఒక ప్రేమ కథ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్, భావన రవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక కన్నడ లో విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ మోక్ టైల్ సినిమాకి తెలుగు రీమేక్ గా రాబోతున్న ఈ గుర్తుందా శీతాకాలం సినిమా కన్నడలో లాగానే తెలుగులో కూడా అదే విజయాన్ని పొందుతుందో లేదో సినిమా విడుదల వరకు వేచి చూడాలి.