తన ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇచ్చిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా తన అందంతో అలాగే నటనతో తెలుగులో అగ్ర కథనాయకల్లో ఒకరిగా నిలిచింది. అయితే వరస షూటింగ్స్ తో బిజీగా ఉండే తమన్నా సడన్ గా ఇంటికి వచ్చి తన ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇచ్చింది. నేను ఇంటికి వచ్చి నా ఫ్యామిలీకి ఈ క్యూట్ కుక్కకి సర్ప్రైజ్ ఇచ్చాను అని తమన్నా తన కుక్క పిల్లతో ఫోటోని తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో తమన్నా చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. వరస షూటింగ్స్ తో బిజీగా గడిపే తమన్నా కొన్ని రోజులు విశ్రాంతి కోసం ఇలా ఇంటికి వచ్చింది. ఇక  మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం  ప్రముఖ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘లెవన్త్‌ అవర్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ని ఆహా ఓ.టి.టి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్, టైటిల్ ని ఈ మధ్యనే విడుదల చేసారు. అలాగే గోపిచంద్ సరసన ‘సీటిమార్’ సినిమాలో కూడా తమన్నా నటిస్తుంది. కరోన వలన ఆగిపోయిన ఈ సినిమా ఈ మధ్యనే మళ్ళీ మొదలయ్యింది. ఈ సినిమాని గౌతమ్ నంద సినిమా దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.