
సొట్ట బుగ్గల సుందరి తాప్సీపన్ను 2010 లో మంచు మనోజ్ సరసన జుమ్మందినాధం సినిమా తో తెలుగు లో అరంగేట్రం చేసింది. తన గ్లామర్ తో నటన తో ప్రేక్షకులని మెప్పించ్చింది తర్వాత ఇటు తెలుగు తమిళ సినిమాలతో బీజీ అయిపోయింది. ‘చష్మే బద్దూర్’ అనే హింది చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చెయ్యడం మొదలుపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ‘పింక్ సినిమా’లో అమితాబ్ తో కలిసి నటించింది. ఈ సినిమా బాలివుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను నటనకు ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాని ప్రస్తుతం తెలుగులో వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. తాజాగా తాప్సీ చిన్న కుక్క పిల్లని ముద్దాడుతున్న ఫోటో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. రష్మీ రాకెట్ సెట్ లో ఇది నా ఎనర్జీ బాల్ అని చెప్పుకొచ్చింది. రగ్గుడ్ లో ఉన్న తాప్సీ ఫోటో అదిరిపోయింది. ప్రస్తుతం తాప్సీ పన్ను ‘రష్మీ రాకెట్’ అనే సినిమాని చేస్తున్నారు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్రం లో తాప్సి ‘రష్మీ’ అనే గుజరాత్ అమ్మాయి పాత్రలో రన్నర్ గా కనిపించనున్నారు. రష్మీ అనే అమ్మాయి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.