
తాప్సీ పన్ను కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మందినాదం చిత్రంతో టాలీవుడ్లో ఆడుగుపెట్టిన తాప్సీ మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సొట్ట బుగ్గల సుందరి తాప్సి బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది. టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయి ‘ఛష్మే బద్దూర్’ ఎంట్రీ ఇచ్చి. ‘పింక్’ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకుంది. గత ఏడాది తాప్సి బద్లా, మిషన్ మంగళ్, సంధ్ కి ఆంఖ్ చిత్రాలలో నటించింది. ఆమె నటించిన ‘గేమ్ ఓవర్’ థ్రిల్లర్ గా తెలుగు, తమిళ భాషలలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. 2020లో కూడా తాప్సి ‘తప్పడ్’ అనే సోషల్ కాన్సెప్ట్ మూవీలో నటించి మెప్పించారు. విమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పర్చుకుని వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాప్సి ప్రస్తుతం ‘రష్మి రాకెట్’ చిత్రంలో నటిస్తుంది. ఈ సొట్ట బుగ్గల సుందరి సినిమాలో పాత్ర పట్ల డెడికెషన్, ఫిట్ నెస్ మీద తప్పకుండా శ్రద్ద పెడుతుంది. తన ఫిట్ నెస్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా సన్ సెట్ లో డ్రింక్ తాగుతున్న ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో షేర్ చేస్తూ ఫ్యాట్ బర్నింగ్ ఎనర్జీ డ్రింక్ అని, దాని తయారి విధానం అందులోకి వాడే పదార్థాలు చెప్పు కొచ్చింది. తాప్సి ఇలా ఫిట్ నెస్,హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ యాక్టివ్ గా ఉంటుంది.