Yes team #ItsTimeToParty is coming with a BAANNGGG now
— BARaju (@baraju_SuperHit) December 16, 2020
Releasing this 24th
Globally on @PrimeVideo
In India @MXPlayer @Hungama_com #AirtelXstream #ViMovies
A Cyber Crime thriller
*ing @Mukhisree @b_ditipriya @MayaNelluri
🎬 @EVS_Goutham
💰 #AllamSubhash
💿 @adityamusic pic.twitter.com/5anuu0jrIK
బుల్లితెరపై రాములమ్మగా ఫుల్ ఎనర్జీతో కనిపించే ప్రముఖ యాంకర్ ‘శ్రీముఖి’. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. దానికి తోడు గతేడాది బిగ్ బాస్ 3కి వెళ్లొచ్చిన తర్వాత అమ్మడి క్రేజ్ డబుల్ అయిపోయింది. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా మ్యాజిక్ చేయాలని చూస్తుంది శ్రీముఖి. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త చిత్రం 'ఇట్స్ టైమ్ టు పార్టీ'. ఈ సినిమాతో గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 24 న ఓ.టి.టి లో విడుదల కాబోతుంది. ఇతర దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. ఇండియాలో మాత్రం ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. థ్రిల్లర్ మూవీ గా రాబోతున్న ఈ సినిమాలో శ్రీముఖి ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాలో కొత్త శ్రీముఖిని చూడబోతున్నారు అని నిర్మాతలు అంటున్నారు.