
ఇటీవలే క్రాక్ సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన హీరోయిన్ శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తె గా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన శృతి హాసన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ అనేంతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. అందం, అభినయం కలిగిన శృతి హాసన్ మధ్యలో కొన్ని తప్పటడుగులు వేసినా వాటిని సరిదిద్దుకుని మళ్ళీ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది.. ఇటీవలే ఆమె నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ కావడంతో శృతి హసన్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా హిట్ తో హీరోకి, డైరెక్టర్ కి ఎంతవరకు కలిసి వచ్చిందో కానీ, హీరోయిన్ శృతి హసన్ కి మాత్రం మంచి పేరుతో అవకాశాలు కూడా వస్తున్నాయి..

ఈ సినిమాలోని తన నటనకు ఫిదా అయినా ప్రభాస్ శృతి హాసన్ కి సలార్ లో అవకాశం ఇచ్చాడు. క్రాక్ సినిమా ముందువరకు శృతి హాసన్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు అంతా.. చేతిలో సినిమాలు కూడా ఏవీ లేవు.. దానికి తోడు ఆమె ఎఫైర్ ల వల్ల ఆమెను సినిమాలో పెట్టుకోవడానికి భయపడిపోయారు నిర్మాతలు.. కానీ ఇప్పుడు ఆమెచేతిలో బడా ప్రాజెక్టులు ఉన్నాయి..

ఈ నేపథ్యంలో చిన్నతనం నుంచి తనకు యాంగ్జైటీ డిసార్డర్ ఉందని ఆమె తెలిపింది. "నేను చాలా సంవత్సరాలుగా ఈ యాంక్జైటీతో బాధపడుతున్నాను. ఇది కొంతమందికి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు.. కానీ నేను చాలా బాధపడ్డాను. మీరు పడే బాధ.. వేరేవారికి బాధాకరమైనది కాకపోవచ్చు. నాకు వేదికపైకి రావడం.. అక్కడ మాట్లాడడం వంటివి చాలా కాలం పాటు భయంగా ఉండేవి. నేను ఓ రకమైన యాంగ్జైటీతో బాధపడుతున్నానని తెలుసుకోవాడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. నాకు 30 ఏళ్లు వచ్చిన తర్వాత నేను ఈ రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించాను" అని ఆమె తెలిపింది.