మల్టిపుల్ టాలెంట్స్ తో శృతి హాసన్ తన హవా చూపిస్తోన్న విషయం తెల్సిందే. నటిగా టాప్ రేంజ్ కు చేరుకున్నా కానీ శృతి హాసన్ కు సంగీతం అంటే ప్రాణం. ఈ నేపథ్యంలో తన మ్యూజిక్ కెరీర్ ను సెట్ చేసుకుంది. గత రెండేళ్లలో యూకే వెళ్ళి అక్కడ వివధ ప్రదేశాల్లో స్టేజ్ షోస్ ఇచ్చింది. అయితే ఇక తిరిగి ఇండియా వచ్చిన తర్వాత శృతి హాసన్ తిరిగి తన సినీ కెరీర్ పై దృష్టి పెట్టింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తోన్న క్రాక్ లో శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కూడా. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న వకీల్ సాబ్ లో కూడా శృతి హాసన్ హీరోయిన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొంటుంది. ఇక రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో శృతి హాసన్ డక్ బడ్డీస్ అంటూ సాత్విక్ అనే పిల్లాడితో కలిసి ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది. తనలో కామిక్ టైమింగ్ ను కూడా ఈ వీడియో ద్వారా చూపించినట్లైంది.