దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత సినిమాల్లోకి మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. రావడమే తెలుగులో రెండు మంచి ఆఫర్లను సొంతం చేసుకుంది. మాస్ మహారాజా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంటోంది. గోవాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించనుంది ఈ అమ్మడు. ఇప్పటికే పవన్ తో రెండు సార్లు నటించగా ఇది మూడో ప్రయత్నం. తమిళంలో కూడా శృతి ఒక సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో శృతి గ్లామరస్ ట్రీట్ హైలైట్ గా నిలుస్తోంది. శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఇమేజెస్ ను అప్లోడ్ చేస్తోంది. వీటికి రెస్పాన్స్ కూడా అలానే ఉంది. రీసెంట్ గా స్విమ్ వేర్ లో లుక్ ను అప్లోడ్ చేసిన శృతి, ఇప్పుడు మరో హాట్ లుక్ తో దర్శనమిచ్చింది. దీనికి "కెమెరా కోసం తప్పితే ఇక దేనికీ వెనుతిరిగి చూడకండి" అని పోస్ట్ చేసింది.