అల్లు అర్జున్ ఆర్య-2 చిత్రంలో తన అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది శ్రద్ద దాస్. ఈ భామ డార్లింగ్, గుంటూరు టాకీస్, పి.ఎస్.వి గరుడవేగ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లలో శ్రద్ద బిజీ బిజీగా వుంది. అయితే 2014 లో నటించిన రాయల్ బెంగాల్ టైగర్ అనే బెంగాలీ సినిమా నెటీఫ్లిక్స్ లోకి వచ్చిన సందర్భంగా ఆమె ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ సినిమా నా మనసుకు చాలా దగ్గరైన సినిమా అని ఈ సినిమా తీసిన రాజీవ్ గంగూలీ-నీరజ్ పాండే లకి ఆమె థాంక్ యు చెప్పారు. ఈ రాయల్ బెంగాల్ టైగర్ సినిమాని వియాకామ్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా బెంగాలీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శ్రద్ద దాస్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇక శ్రద్ద ఈ మధ్య పాంథర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆమె తెలుగులో ‘అర్ధం’ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో హీరో గా అజయ్ నటిస్తుండగా, అమని ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.