తెలుగులో సాహసవీరుడు సాగరకన్య, ఆజాద్, భలేవాడివి బాసు వంటి చిత్రాలతో అలరించిన శిల్పాశెట్టి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. కాకపోతే టిక్ టాక్ వీడియోలు చేయడం , యోగసనాలు చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే శిల్ప శెట్టి తన సోషల్ మీడియా శిల్ప కా మంత్ర అనే హాష్ టాగ్ తో ఫిట్నెస్ గురించి సలహాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తన సోషల్ మీడియాలో కొత్తగా ఒక పోస్ట్ పెట్టింది. “మీరు అనుకున్నది సాధించాలి అంటే దానికోసం ఏమైనా చేయాలని, మిలో మీకు సందేహం లాంటివి వచ్చిన కూడా మీరు భయపడకండి ఎందుకంటే మీరు ఒంటరి కాదు అందరికి ఇలానే ఉంటుంది అని మీరు అనుకున్నది ఎలాగైనా సాధించండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, మారండి" అని క్యాప్షన్ తో ఆమె తను వ్యాయామం చేస్తూ ఉన్న ఫోటోని పోస్ట్ చేసారు. ఇక 45 ఏళ్ళ శిల్పాశెట్టి ఇప్పటికి చాలా అందంగా ఉంటుంది. దానికి కారణం ఆమెకి ఫిట్నెస్ మరియు యోగ మీద ఉండే ఆసక్తి . ఆమె 2009లో రాజ్ కుంద్రానితో వివాహం జరిగిన తర్వాత మెల్లగా సినిమాలని తగ్గించింది. ఇక రాజ్ కుంద్రా, శిల్ప దంపతులకు ఎనిమిదేళ్ళ కొడుకు వియాన్, మూడు నెలల కూతురు సమిషా ఉన్నారు.